HomeTelanganaNizamabadశ్రీ సాయి బి.ఈడి కాలేజీలో అక్రమ ఫీజుల వసూలుపై ‘టిజివిపి’ (TGVP) ఆగ్రహం – విద్యార్థులు...

శ్రీ సాయి బి.ఈడి కాలేజీలో అక్రమ ఫీజుల వసూలుపై ‘టిజివిపి’ (TGVP) ఆగ్రహం – విద్యార్థులు రూపాయి కూడా కట్టొద్దు: టిజివిపి పిలుపు శ్రీ సాయి బి.

ఈడి కాలేజీలో విద్యార్థుల నుండి అక్రమంగా “అటెండెన్స్ ఫీజు” (హాజరు రుసుము) వసూలు చేస్తున్నారనే సమాచారంతో తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) నాయకులు తక్షణమే కాలేజీకి చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.

అయితే, దీనిపై ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా సమాధానం చెబుతూ “మేము ఫీజు వసూలు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అని మాట్లాడడం జరిగింది.ప్రిన్సిపాల్ వైఖరిపై టిజివిపి నాయకులు వెంటనే స్పందించి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ (VC) గారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.

కాలేజీల్లో ఎలాంటి అటెండెన్స్ ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి నిబంధన ఏదీ లేదని విసి గారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వెంటనే సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థుల నుండి ఎలాంటి అదనపు రుసుములు తీసుకోకూడదని విసి గారు ఆదేశించారు.

విసి గారు ఆదేశించినప్పటికీ, ప్రిన్సిపాల్ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయాలని చూస్తూ మొండిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్థులకు టిజివిపి స్పష్టమైన సమాచారం ఒక్క రూపాయి కూడా కట్టొద్దు శ్రీ సాయి బి.

ఈడి కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఎవరూ కూడా అటెండెన్స్ ఫీజు పేరుతో ఒక్క రూపాయి కూడా కాలేజీ యాజమాన్యానికి కట్టకూడదు. యూనివర్సిటీ నిబంధనా విద్యార్థులకు ఒకవేళ అటెండెన్స్ తక్కువగా ఉంటే, దానికి గల కారణాలను వివరిస్తూ యూనివర్సిటీకి లేఖ (Letter) సమర్పిస్తే, పరిశీలించి యూనివర్సిటీ నుంచే నేరుగా అనుమతి ఇస్తారు. అంతే తప్ప కాలేజీకి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు.

టిజివిపిని సంప్రదించండి: కాలేజీ యాజమాన్యం ఇంకా ఎవరి దగ్గరైనా బలవంతంగా ఫీజులు వసూలు చేయాలని చూస్తే, వెంటనే టిజివిపి నాయకులను సంప్రదించాలని కోరుతున్నాం.

విద్యార్థుల పక్షాన టిజివిపి ఎల్లప్పుడూ పోరాడుతుందని, అక్రమ వసూళ్లకు పాల్పడితే కాలేజీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments