HomeDevotionalవరంగల్ లో పవన్ టూర్ ......పోటెత్తిన అభిమానులు

వరంగల్ లో పవన్ టూర్ ……పోటెత్తిన అభిమానులు

సినిమానటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే చిన్నారి ని కలిసాడు.

తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు.

అతని వయసు 15 సంవత్సరాలైనా.. 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం. గాలిబుడగ లాంటి తన జీవితంలో పవన్ కల్యాణ్ ను కలిసి, ఆయనకు ఆయన సినిమాలోని డైలాగ్ వినిపించాలన్నదే చివరి కోరిక. ఆ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్ ను పరామర్శించారు.

బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు. అతని కాసేపు సరదా గా మాట్లాడాడు సెల్ఫీ దిగాడు అతనికి జరుగుతున్న చికిత్స ను అడిగాడు అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు.

అనంతరం స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో జనసైనికులతో ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొననున్నారు.

//// పోటెత్తిన అభిమానులు ////

పవన్ హన్మకొండ పర్యటన కు అభిమానులు పోటెత్తారు. తెలంగాణ లో ఇటీవల జనసేన సభ నిర్వహణ కు అనుమతి ఇవ్వక పోవడంతో వరంగల్ లో పవన్ పర్యటన ఫై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కానీ ఆయన పర్యటన కు అనుమతి ఇచ్చిన పోలీసులు ఆయన పర్యటన కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.అభిమానులు భారీగా తరలి వచ్చారు ఆయన ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments