HomeTelanganaHyderabadఆరుట్ల పబ్లిక్ స్కూల్ లో రేవంత్ సందడి

ఆరుట్ల పబ్లిక్ స్కూల్ లో రేవంత్ సందడి

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు . కార్పోరేట్ స్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాల ప్రాంగణంలో సీఎం కలియతిరిగారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

తర్వాత అత్యాధునిక కిచెన్‌, ల్యాబ్స్‌, లైబ్రరీ, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, మ్యూజిక్ క్లాస్‌రూమ్, ప్లే గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అత్యాధునిక కిచెన్‌లో సిబ్బందితో కలిసి సీఎం పూరీలు చేశారు.

తర్వాత మ్యూజిక్ క్లాస్ రూమ్‌కు వెళ్లి గిటార్ ప్లే చేశారు. అనంతరం ప్లే గ్రౌండ్‌‌ను సందర్శించి సరదాగా విద్యార్థులతో ఫుట్‌బాల్‌ ఆడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments