శాంతినగర్ ఇంట్లో చోరీ జరిగింది అజ్మరి బేగం తన తల్లిదండ్రులు మరియు కూతురితో కలిసి నిన్న రాత్రి 1 గంటకు నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు లేచి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.బీరువాలో ఉన్న రూ 40,వేల నగదు6 గ్రాముల బంగారు చెవి కమ్మలు 20 తులాల వెండి పట్టీలుమరో బీరువాలో ఉన్న రూ 80 వేల నగదు
గుర్తుతెలియని దుండగులు రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తాళాలు పగలగొట్టి విలువైన సొమ్ము ఎత్తుకెళ్లారు.అజ్మరి బేగం ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
