రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ బిజెపి కిసాన్ మోర్చా గవర్నర్ కు పిర్యాదు చేసింది ఈ మేరకు కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వా నర్సయ్య అద్వర్యం
ఓ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసారు ఖరీఫ్ సీజన్ మొదలైనా రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం శ్రద్ధ లేదని, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం సమర్పించింది.
తక్షణమే ‘సమగ్ర వ్యవసాయ ప్రణాళికను’ (Action Plan) ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ‘రైతు భరోసా’ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నకిలీ విత్తన మాఫియాపై పీడీ (PD) యాక్ట్ ప్రయోగించాలని, వరి సాగుపై పెట్టిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని, ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (PMFBY) ఈ ఖరీఫ్ నుండే అమలు చేయాలని, కౌలు రైతుల హక్కులను కాపాడాలని వారు కోరారు
