విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించడంతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‍ను ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని ఇది పేదలు చదివే పాఠశాలలు అనే అపోహలు తొలగించించేందుకు టీపీఎస్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారే భవిష్యత్ నాయకులు అవుతారని తాను సంపూర్ణంగా నమ్ముతున్నానన్నారు. విద్యాశాఖపై ఈ ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.
