HomeCRIMEడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. - నాగరంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ- ప్రమాణ స్వీకారం...

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. – నాగరంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ- ప్రమాణ స్వీకారం చేసిన విద్యార్థులు, యువత డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా నిజామాబాద్ నగరంలో అవగాహన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి.

గురువారం నాగరమ్ చౌరస్తాలో ఉత్తర గ్రామీణ సీఐ బి. శ్రీనివాస్,ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక భారీ ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరమ్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి అధికారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణ స్వీకారం చేయించారు.

సీఐ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ..

“యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలి. మత్తుకు దూరంగా ఉంటూ, సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది” అని పిలుపునిచ్చారు.

మరోవైపు, నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మల హృదయ్‌ పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

నిర్మల హృదయ్‌ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడవ టౌన్‌ సీఐ శ్రీనివాస్‌రాజ్‌, ఎస్ఐలు హరిబాబు, నారాయణ, సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments