ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్ట్ లకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డు వర్తింపు చేయాలని టీయూడబ్ల్యూజె హెచ్143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ఆన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో జిల్లా టీయూడబ్ల్యూజె హెచ్ 143 ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. జర్నలిస్ట్ లకు రూ. 47 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశామని, ఆలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం డస్క్ జర్నలిస్ట్ లకు సపరేట్ ఆక్రిడేషన్ కార్డులు ఇస్తానని జీవో తీసుకురావడంతో వ్యతిరేకించినట్లు చెప్పారు.
చిన్న పత్రికలకు ఆక్రిడేషన్ మెలుకలు పెడితే వీటి కోసం పోరాటం చేయడంతో ప్రభుత్వం ఆక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్ లకు ఇండ్లస్థలాలు అందించాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అడకమిటీ కన్వీనర్ గా రజినీష్, కో కన్వీనర్ మోహన్, గౌరవ అధ్యక్షులుగా పప్పఖాన్ తోపాటు 10 మందితో కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రమణ, యోగన్న, తదితరులు పాల్గొన్నారు.
