పెర్కెట్ భరత్ చంద్ర పాఠశాల వద్ద ఉద్రిక్తతపోలీసులు అదుపులో ప్రిన్సిపల్ యజమాన్యం మున్సిపల్ కేంద్రంలోని పెర్కిట్ ప్రాంతంలో గల మల్లయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు సంబంధించిన భరత్ చంద్ర పాఠశాల వద్ద ఉధృత చేస్తుంది. భారీగా పోలీసులు మోహరించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ,బిజెపి బిజెపి అనుబంద సంస్థల ఆందోళన ఉద్దీతకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు గల విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో గల పాఠశాలలో హిందువుల పిల్లలకు ఉర్దూలో విద్యాభ్యాసం నిర్వహించడం జరుగుతుంది.
పాఠశాల విద్యార్థులచే నమాజ్ చేయిస్తున్న ప్రిన్సిపాల్. విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిసిన వెంటనే వారు పాఠశాల కు వచ్చి పాఠశాల యాజమాన్యంతో మరి హిందువుల పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇలా ప్రవర్తించడం సరైనదేనా అని అడిగారు. అందుకుగాను పాఠశాల యాజమాన్యం ఒక లాంగ్వేజ్ నేర్పిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఉర్దూ విద్యాభ్యాసం నేర్పిస్తున్నామన్నారు. హిందువుల పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం అవసరమా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు.
మరి ముస్లింల పిల్లలకు హిందువులకు యొక్క భగవద్గీతను బోధిస్తున్నారని అడిగారు. అసలు ప్రభుత్వం ఏమైనా జీవోను ఇచ్చిందా మరి హిందువుల పిల్లలకు ఉర్దూ బోధించమని అని చెప్పేసి వారు అడిగారు. మరి విద్య కరికులంలో ఏమైనా ఉర్దూ బోధించమని సూచనలు ప్రభుత్వం చేసిందా అని చెప్పేసి వారు ప్రశ్నించారు.
అందుకు యాజమాన్యం వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై కోపోదృక్తులై ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రారంభం నుండి విద్యార్థులకు ఉర్దూ విద్యాభ్యాసాన్ని బోధించడం జరుగుతుందని .
అనర్గళంగా ఉర్దూ విద్యను చెప్పడం చూసి తల్లిదండ్రులు విస్తు పోయారు. పాఠశాలకు ముస్లిం వ్యక్తి ప్రిన్సిపాల్ గా చేరడంతో ఇలా ఉర్దూ విద్యాభ్యాసాన్ని బోధించడం జరుగుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల పాఠశాల ప్రిన్సిపల్ యజమాన్యాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనను జరగకుండా పాఠశాల వద్ద బందోబస్తు నిర్వహించారు.విద్యా కార్యాలయానికి స్థానిక ఎమ్మార్వో సత్యనారాయణ . చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులచే రాతపూర్వకంగా ఫిర్యాదు అందుకున్నారు.
విచారణ నిమిత్తం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోపోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ జాన్ రెడ్డి, బిజెపి. ఏబీవీపీ. నాయకులు. కార్యకర్తలు. సబ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, యాసార్ అర్ఫత్, లు తదితరులు పాల్గొన్నారు
