హైదారాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని బాబూనగర్‌లో ఉన్న ఓ ఇంట్లో భారీ పేలుడు జరిగింది పేలుడు ధాటికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు కు గల కారణాలు ఇంకా నిర్దారణ కాలేదు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్‌కు చెందిన ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది.
పేలుడు సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మొదటి గ్యాస్ సిలెండర్లు పేలాయని భావించారు కానీ సిలిండర్లు ఉన్నాయి. వాటికేమి జరగలేదు ఒకవేళ ఆ సిలిండర్లు కూడా పేలి ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేది
