HomeTelanganaNizamabadఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయం: సీపీ పి.సాయి చైతన్య

ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయం: సీపీ పి.సాయి చైతన్య

పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ, ఎటువంటి రిమార్కులు లేకుండా సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.

పదవీ విరమణ పొందిన అంగూర్ సుదర్శన్ (ఏ.ఎస్.ఐ, టౌన్-4): 36 ఏళ్ల సుదీర్ఘ సేవలు, మహమ్మద్ అబ్దుల్ వహాబ్ (ఏ.ఎస్.ఐ, ఆర్మూర్): 36 ఏళ్ల సుదీర్ఘ సేవలు, మహమ్మద్ అబ్దుల్ హకీం (ఏ.ఆర్. ఏ.ఎస్.ఐ, హెడ్ క్వార్టర్స్): 36 ఏళ్ల సుదీర్ఘ సేవలు, ఎం.ఏ. అజ్మత్ (హెడ్ కానిస్టేబుల్, కోటగిరి): 41 ఏళ్ల సుదీర్ఘ సేవలు, తాకుర్ ఆషా కుమారి (సీనియర్ అసిస్టెంట్, పోలీస్ కార్యాలయం): 38 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించారు.

ఈ ఐదుగురు సిబ్బందికి సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, పదవీ విరమణ శుభాకాంక్షల సర్టిఫికేట్లను కమిషనర్ అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉద్యోగంలో పదవీ విరమణ అనేది తప్పనిసరి. శాఖకు మీరు అందించిన సేవలు ఎంతో ఘననీయమైనవి. రిటైర్మెంట్ తర్వాత మీకు ఎలాంటి అవసరం వచ్చినా శాఖ మీకు ఎల్లవేళలా సహకరిస్తుంది.

ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్,ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ. జగతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments