కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో సంబల్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో ఎండు గంజాయి పట్టుబడింది.
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సంబల్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో ఎండు గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు మంగళవారం రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను..
అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి రూ.5.80 లక్షల విలువైన 10.9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులు ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రకు చెందిన గణేష్ పండిత్‌గా గుర్తించారు.
ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ నుంచి నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను రిమాండ్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
