HomeLaw and Orderపోలీస్ స్టేషన్ సందర్శించిన ఐజి..--గౌరవ వందనం స్వీకరణ..--మొక్క నాటిన మల్టీ లెవెల్ వన్ ఐజి..--పోలీస్ స్టేషన్,...

పోలీస్ స్టేషన్ సందర్శించిన ఐజి..–గౌరవ వందనం స్వీకరణ..–మొక్క నాటిన మల్టీ లెవెల్ వన్ ఐజి..–పోలీస్ స్టేషన్, స్టేషన్ రికార్డు పరిశీలన..

ఎల్లారెడ్డి. రాష్ట్ర పోలీస్ శాఖ మల్టీ లెవెల్ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఐజి స్థానిక పోలీస్ స్టేషన్ రాగానే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, స్థానిక డిఎస్పి శ్రీనివాసరావు, సిఐ రాజారెడ్డి, ఎస్సై రాజు పూల మొక్కలను ఐజి కి ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఐ జి రాకను పురస్కరించుకొని శాఖాపరంగా ఉన్నతాధికారులకు ఇచ్చే పోలీస్ గౌరవ వందనాన్ని పోలీస్ శాఖ సిబ్బందిచే ఐజి స్వీకరించారు. ఆయన రాకను పురస్కరించుకుని రెడ్ కార్పెట్ పరిచి పోలీస్ నిబంధనల ప్రకారం ప్రత్యేక స్టేజిను తీర్చిదిద్దారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన పూల మొక్కలు నాటారు.

అనంతరం పోలీస్ స్టేషన్ గదులు, అరెస్టు చేసి స్టేషన్ కి తరలించిన నిందితులను ఉంచే సెల్, బ్యారక్, పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్నింటిని ఐజి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ రికార్డులను ఆయన చూశారు.

స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు విషయాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐజికి వివరించారు. దాదాపు మూడు గంటల పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న ఐజి అన్ని విషయాలను క్షుణంగా పరిశీలించి సిబ్బందిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నారు.

స్థానిక పోలీస్ సిబ్బందికి శాఖా పరమైన పలు సూచనలు సలహాలు ఈ సందర్భంగా ఐజి ఇచ్చారు. ఆయన వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments