పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కోరారు.
ఈ మేరకు మంత్రిని కలిసి పసుపు బోర్డు కార్యకలాపాలను వివరించడంతోపాటు, సాగుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రైతులకు న్యాయం జరిగేలా తగిన పరిష్కారాలు చూపాలని విజ్ఞప్తి చేశారు.పసుపు రైతుల సమస్యలపై ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో కిసాన్ సంఘ్ అధ్యక్షుడు సాయిరెడ్డితో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
