HomeLaw and Orderకంటేశ్వర్‌ అండర్‌పాస్‌ వద్ద 45 రోజుల ఆంక్షలు..16 నుంచి వాహనాల దారి మళ్లింపు..

కంటేశ్వర్‌ అండర్‌పాస్‌ వద్ద 45 రోజుల ఆంక్షలు..16 నుంచి వాహనాల దారి మళ్లింపు..

నిజామాబాద్‌ నగరంలోని కంటేశ్వర్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడనుంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో డబుల్‌ ట్రాక్‌ పనుల్లో భాగంగా అండర్‌పాస్‌ విస్తరణ చేపట్టనుండటంతో అక్టోబరు 16 నుంచి సుమారు 45 రోజుల పాటు ఒకవైపు మార్గాన్ని మూసివేయనున్నారు.

ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ మళ్లింపు మార్గాలను పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య మంగళవారం ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.


నగరంలోకి వచ్చే వాహనాలకు..
ఆర్మూర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, హైదరాబాద్‌ వైపు నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు కంటేశ్వర్‌ బైపాస్‌, మీ సేవ కంటేశ్వర్‌ మీదుగా పనులు పూర్తయిన మరోవైపు అండర్‌పాస్‌ గుండా ఎన్టీఆర్‌ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి కుడివైపు తిరిగి రైల్వేస్టేషన్‌ ఎదుటి మార్గంలో బస్టాండ్‌కు వెళ్లాలి.


నగరం నుంచి బయటకు వెళ్లేవారు..


ఆర్మూర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు దేవీ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్‌ మీదుగా దుబ్బ శివాజీ విగ్రహం, దుబ్బ రోడ్డు గుండా ప్రయాణించాలి. దుబ్బ చౌరస్తాలోని శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద ఎడమవైపు తిరిగి ఖానాపూర్‌ చౌరస్తాకు చేరుకోవచ్చు. మరో మార్గంగా దుబ్బ చౌరస్తా నుంచి నేరుగా జీజీ కళాశాల యూటర్న్‌ వరకు వెళ్లి బైపాస్‌ మీదుగా కంటేశ్వర్‌ డీఎస్‌ చౌరస్తాకు చేరుకోవచ్చు.


హైదరాబాద్‌కు మరో మార్గం..


హైదరాబాద్‌, కామారెడ్డి వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్‌ చౌరస్తా, కోర్టు చౌరస్తా, పులాంగ్‌ చౌరస్తా మీదుగా మాధవనగర్‌ రైల్వేగేట్‌ దాటి బైపాస్‌ నుంచి హైదరాబాద్‌ రోడ్డుకు చేరుకోవచ్చు. బోధన్‌, బాన్సువాడ, వర్ని వైపు వెళ్లే వాహనాలకు ప్రస్తుతం ఉన్న మార్గాల్లోనే రాకపోకలు కొనసాగుతాయి.


సంప్రదించాల్సిన నంబర్లు


ట్రాఫిక్‌ సమస్యలు లేదా మార్గాలపై సందేహాలుంటే ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌ 9959226022, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712659700, 08462-226090, ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓ 8712659842 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments