వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దే గెలుపు అంటూ సీఎం రేవంత్ చెప్తున్నారు యంత్రాంగాన్ని సైతం ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారు.సర్ పక్రియ పూర్తీ అయ్యాక పార్టీ వైపు నుంచి కూడా కార్యాచరణ మొదలు అయ్యేలా ఉంది.
మరో సారి అధికారం లోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఐదు జిల్లాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది మిగతా జిల్లాల్లో విషయంలో పట్టనట్లుగా వుండడం పార్టీ వర్గాలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఒక్కపుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలను ఎందుకు ఆశలు వదులుకున్నారనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఆ జిల్లాలకు ఎలాగో మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. అమాత్యులు లేక అక్కడ అభివృద్ధి జరక్క…. నిధులు రాక…. అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. దాదాపు 55 నియోజకవర్గాలున్న ఆ జిల్లాలను హస్తం పార్టీ ఎందుకు చిన్న చూపు స్తోంది.
రాబోవు రోజుల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని తెలిసినా… అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంది.? ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలు మంత్రి పదవి నోచుకోలేవు. అసలేం జరుగుతోంది? అని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు ఆలోచనలో పడ్డారట.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ…2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు తొమ్మిదింటిలో హస్తం పార్టీ అభ్యర్థులు గెలిచారు.
ఉమ్మడి నల్గొండ లో మొత్తం 12 స్థానాలకు పదకొండు కాంగ్రెస్ గెలుచుకుంది. మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలకు గాను పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే 12 స్థానాల్లో పది హస్తం పార్టీ గెలిచింది. కరీంనగర్ నగర్ జిల్లాలో 13 స్థానాలకు 8 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
ఈ పైన పేర్కొన్న ఐదు జిల్లాల్లో మొత్తం 61 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ గెలిచిన ఐదు జిల్లాల్లో ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఇద్దరేసి మంత్రులున్నారు.
మరి మిగతా జిల్లాల పరిస్థితేంటి? అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం లేదని లైట్ తీదుకుంటుందా? మంత్రులను నియమించకుండా ఆ జిల్లాలను ఎందుకు గాలికొదిలేసినట్లు అంటూ మంత్రి పదవులు దక్కని జిల్లా నేతలు పెదవి విరుస్తున్నారట.
ఉత్తర తెలంగాణ కు మొండి చెయ్యు….ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో పది స్థానాలకు అధికార పార్టీ నాలుగింటిలో విజయం సాధించింది. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి దక్కింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇటు నిజామాబాద్ జిల్లాకు పెద్దగా ఆయన ప్రభావం చూపే అవకాశం లేదు.
అయితే మంత్రి పదవులు దక్కని జిల్లాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుస్తే…. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నాలుగింటిలో గెలవగా….. ఉమ్మడి మెదక్ జిల్లాలో (సిద్ధిపేట, సంగారెడ్డి) కలుపుకొని పదింటికి కాంగ్రెస్ మూడు గెలిచింది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ( ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగా రెడ్డి ) పరిధిలో 15 స్థానాలకు కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది.
అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 48 స్థానాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అంటే అధికార పార్టీకి తక్కువ వచ్చిన జిల్లాలపై అధిష్టానం శీతకన్ను వేసిందంటున్నారు ఆయా నేతలు.
గ్రౌండ్ లెవల్ లో పార్టీ పరిస్థితి ఏంటి? హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ తగ్గించిందా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారట. మొన్న బల్దీయా ఎన్నికల ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి హైదరాబాద్ కు న్యాయం చేశామన్న డబ్బా కాంగ్రెస్ కొట్టుకున్నప్పటికి గ్రౌండ్ లెవల్ అక్కడ పార్టీ పరిస్థితి ఏమంత బాగులేదట.
ఇక మెదక్, నిజామాబాద్ పరిస్థితి మరి దారుణం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన సీట్లు రాకున్నా…. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. వారిని కాపాడుకునే ప్రయత్నం లోపించిందన్న చర్చ జరుగుతోంది. 61 నియోజకవర్గాలున్న ఐదు జిల్లాలకే మంత్రులు ఇద్దరేసి ఉంటే పార్టీ వీక్ గా ఉన్న జిల్లాల్లో ఒక్క మంత్రి లేకపోవటంపై ఆ పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారంట.
మిగతా 58 నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్నది అధికార పార్టీ పట్టించుకోదా అన్న చర్చ హస్తం పార్టీ పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్ వ్వా మారిందంట. కంచుకోటకు దక్కని మంత్రి పదవి…..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 2014 కు ముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ తర్వాత నేటి బీఆర్ఎస్ హవా కొనసాగింది.
గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలిచింది. అయితే ఈ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. ఇదే జిల్లా నుంచి టీ పిసిసి చీఫ్ ఉన్నా…. మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఎక్కడైతే మంత్రి పదవులు ఇవ్వని జిల్లాలు ఉన్నాయో అక్కడే బీజేపీ స్థాంగ్ గా ఉంది. ఇక్కడే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు.
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సిద్ధంతాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందా….. ఈ జిల్లాల్లో ఫోకస్ పెట్టకపోవటానికి కారణం ఏంటి? ఆ ఐదు జిల్లాలే కాంగ్రెస్ కు కలిసిస్తాయా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ అక్కడ మరింత నష్టం మూతగాట్టుకుంటోoదన్న వాదన కూడా ఉంది.
మరి రానున్న రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నైనా అమాత్య పదవి నోచుకోని జిల్లాలకు న్యాయం జరగనుందా? అన్న టాక్ నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
