మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాల్కల్ గ్రామానికి చెందిన దాయాని ప్రశాంత్ (35) అనుమాన స్పదస్థితి మృతి చెందాడు. ఈ మేరకు తల్లి శ్రీమతి దాయాని శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదు ప్రకారం, మృతుడు ఇటీవల సౌదీ అరేబియా నుండి స్వగ్రామానికి వచ్చాడు. గత నెల 29నరాత్రి గ్రామానికి చెందిన బంటి అనే వ్యక్తితో కలిసి మద్యం సేవించిన అనంతరం మద్యం మత్తులో కిందపడడంతో గాయపడినట్లు తెలిసింది.
అనంతరం మృతుని అతని భార్య చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం తిరిగి ఇంటికి తీసుకువెళ్లగా, 30న ఆయన మృతి చెందినట్లుగా మృతుని తల్లి తాన పిర్యాది లో పేర్కొంది
మృతుడిని బిల్డింగ్ పైనుండి బలవంతంగా తోసెయ్యడం వల్లే తలకు తీవ్ర గాయం అయి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు
