HomeCRIMEవిద్యా సంస్థల జోలికి వెళ్తే క్రిమినల్ కేసులే .....విద్యార్ధి సంఘాల దాడుల ఫై సీపీ సీరియస్...

విద్యా సంస్థల జోలికి వెళ్తే క్రిమినల్ కేసులే …..విద్యార్ధి సంఘాల దాడుల ఫై సీపీ సీరియస్ ……కేసులనమోదు

విద్యా సంవత్సరం మొదలయింది ఎప్పటిలాగే విద్యార్థి సంఘాలు వసూళ్ల వేట కు దిగాయి పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలలను వదిలేసి తమకు కాసుల కురిపించి ప్రైవేట్ విద్యా సంస్థల మీద పడ్డారు.

సరైన అనుమతులు లేవని అధిక పీజులని పుస్తకాలు విక్రయిస్తున్నారని పీజులకోసం వేధిస్తున్నారని పైకి చెప్పుకోవడానికి ఒక్కో సంఘం ఒక్కో అంశం మీద ప్రైవేట్ విద్యాసంస్థల మీద దండెత్తుతున్నారు.

ఏ సంఘం అయినా సరే ఫైనల్ గా సెటిల్ మెంట్ బాగోతమే. గతంలో ఒకటి రెండే సంఘాలే స్పష్టమైన కార్యాచరణ తో విద్యాసంస్థల నిర్వాహకుల మీద నిర్దిష్టమైన దండెత్తేవారు కానీ ఇప్పడు సంఘాల ముసుగులో విద్యార్ధి నేతలు తమ సొంత అజెండా లను అమలు చేస్తున్నారు తమదారి కి రాని విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని ఏకంగా దాడులకు తెగబడుతున్నారు.

విద్యాసంస్థల నిర్వహణ అంటే ఎన్నో వ్యయ ప్రయాసలతో సాగేది కావడం తో యాజమాన్యాలు సైతం నయానో భయానో సంఘాల నేతల తో సెటిల్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి వైఖరులు మితి మీరి పోతుండడం తో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరో వైపు తరుచు ప్రైవేట్ విద్యాసంస్థల మీద దాడులు జరగడాన్ని పోలీసుకమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు విద్యాసంస్థల్లో లొసుగులు లోపాలుంటే అధికారుల ను కల్సి చర్యల కోసం అడగాలి తప్ప నేరుగా విద్యాసంస్థల మీదికి వెళ్లడం శాంతి భద్రతల వ్యవహారంగా చూడాలనేది పోలీసుల ఆలోచనగా ఉంది.

అందుకే ఇలాంటి పోకడ లకు అడ్డు కట్ట వేయడానికి పోలీసుశాఖ సమాయత్తం అవుతుంది దాడులు జరిగితే ఇకనుంచి కఠినంగా వ్యవహరించాలని సీపీ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా ఆయా విద్యాసంస్థల మీద దాడులకు తెగ బడే సంఘాల నేతల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు ఇప్పటికే నిజామాబాద్ నగర శివారు లోని నారాయణ విద్యా సంస్థా నిర్వాహుకుల పిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ లో చందూర్ లో శ్రీ సాయి విద్యాసంస్థ లోకి చొరబడిదాడులకు పాల్పడిన వారిమీద కేసులు నమోదు చేసారు. ఈ రెండు కేసుల్లో ఉన్న నిందితుల మీద ఇదివరకే కేసులుంటే కఠినమైన సెక్షన్ లు నమోదు చేయనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments