వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిర్మల్ నిజామాబాద్ , కొమురం భీం ఆసిఫాబాద్ గురువారం జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, స్నానానికి దిగిన గట్కేసర్‌కు చెందిన భక్తుడు గల్లంతయ్యాడు.
కన్నాయిగూడెంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.జగిత్యాల జిల్లాలోని రాయికల్, బీర్పూర్ తదితర మండలాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల కు పైగా వర్షపాతం రికార్డయింది.
మరోవైపు సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో పెన్‌గంగా నది ఉప్పొంగుతుండటంతో ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, తిర్యాని మండలాల్లో 12 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి .
///// నిజాంసాగర్ కు పెరుగుతున్నఫ్లో .///
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది 17 టియంసి ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు లోకి ప్రస్తుతం 7,466 టియంసి లమేరకు నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమాయానికి 4,622 టియంసి లుండే
