శ్రీరామ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 13714 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 80.501 టీఎంసీల ఉండగా గురువారం మధ్యాహ్నం వరకు 1065.90 అడుగులు 17.243 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఏ.ఈ.ఈ రవి తెలిపారు.
ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ కాకతీయ కాలువ కి 300 క్యూసెక్కులు, మంచి నీటి అవసరాలకు 231 క్యూసెక్కులు ,ఆవిరి రూపంలో 220 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు.
మొత్తo కలిపి 751 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి ఔట్ ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1077.10 అడుగులు 37.632 టీఎంసీలుగా ఉందని తెలిపారు.
ప్రాజెక్టులోకి ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.911 టీఎంసీల నీరు వచ్చి చేరిందని. ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.287 టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు అన్నారు.
