సిరిసిల్ల జిల్లాకు చెందిన సస్పెండెడ్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు నిజామాబాద్‌లో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.పోలీసుల వివరాల ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న శ్రీకాంత్ గౌడ్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కేసు నమోదు కాగా, అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా నిజామాబాద్‌లో గుర్తించి అరెస్టు చేశారు.
కాగా, గతంలో తిమ్మాపూర్ ఎస్సైగా పనిచేసిన శ్రీకాంత్ గౌడ్‌పై ఇసుక అక్రమ రవాణా కేసులో నిందితులను తప్పించేందుకు రూ.2 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లైంగిక దాడి కేసులో అరెస్టు కావడంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
