మిట్టాపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి, హుండీ తాళాలు పగులగొట్టి స్వామివారి వెండి నామాలు, కన్నులు, అమ్మవారి పుస్తెల తాడు, మట్టెలతో పాటు ఇతర వెండి పూజా సామగ్రిని అపహరించారు.
ఉదయం అర్చకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.
నిందితులను త్వరగా పట్టుకుని ఆలయ ఆభరణాలను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేశారు.
