సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పొటెత్తారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి. అమ్మవారిని దర్శించుకునేందుకు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు.
మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆషాఢమాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున అమ్మవారికి సీఎం రేవంత్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
అలాగే వీఐపీలకు మరో క్యూలైన్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేశారు. బందోబస్త్‌లో సుమారు 1500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, లష్కర్ జాతర సందర్భంగా ఇవాళ అమ్మవారికి బోనాలు సమర్పించగా.. రేపు సోమవారం నాడు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు
