సామాజిక విప్లవకారుడు, ప్రముఖ సాహితీవేత్త అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలు నిజామాబాద్‌లోని చంద్ర శేఖర్ కాలనీ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో నెలకొన్న కుల వివక్షను రూపుమాపడానికి, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అన్నాభావు సాఠే జీవితాంతం పోరాడారని కొనియాడారు.
విద్య ద్వారానే ప్రతి ఒక్కరూ సామాజిక సాధికారత సాధించగలరని ఆయన అందించిన సందేశం నేటి తరానికి శిరోధార్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు భక్తవత్సలం ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొని అన్నాభావు సాఠే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
