నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగ సందర్భంగా ఖిల్లా చౌరస్తాలోని శారదా గద్దె వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం చేకూరాలని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
