గణేశ్ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో సెప్టెంబర్ 25న సాయంత్రం 6 గంటల నుంచి 27న ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయాలని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం తెలిపారు.
తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్–1968లోని సెక్షన్ 20(1) ప్రకారం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ షాపులు, 2బీ బార్లు, క్లబ్బులు, టీడీ–1, టీఎస్‌బీసీఎల్ తదితర మద్యం విక్రయ కేంద్రాలు ఈ ఆదేశాల పరిధిలోకి వస్తాయని తెలిపారు.గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
