నగరంలోని ఎల్లమ్మగుట్టలో శ్రీ రాజరాజేశ్వరి యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణదానం చేయండి’ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 25 మంది యువకులు రక్తదానం చేశారు.
ఎస్బీ వాలంటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. కార్యక్రమానికి నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీష్, 21వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లలితాచరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రక్తదాతలకు రక్తదాన ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారు తమను సంప్రదించాలని మండలి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, రాజు, భరత్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.
