త్వరలో కృత్రిమ కాళ్లు అందిస్తామని హామీ విద్యుత్ షాక్‌తో రెండు కాళ్లు కోల్పోయి ఉపాధికి దూరమైన ఆర్మూర్‌కు చెందిన మహమ్మద్ తాయూబ్కు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి చేయూతనందించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తనకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాయూబ్ మంగళవారం ఎమ్మెల్యేను కలిసి తన పరిస్థితిని వివరించారు.
స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల్లో ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గురువారం కలెక్టర్‌తో మాట్లాడి తాయూబ్కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందేలా ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా త్వరలో కృత్రిమ కాళ్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో తాయూబ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
