రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ అంశాలపై ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిగిన చర్చల్లో రెండు డీఏలను మంజూరు చేసేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేసింది. మరో నాలుగు నెలల అనంతరం ఇంకో డీఏ ఇచ్చే అంశానికీ అంగీకారం తెలిపింది. పీఆర్సీపై ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కమిషన్ గడువును మరోసారి పొడిగించకుండా నిర్ణీత వ్యవధిలో నివేదికను అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నివేదిక అందిన వెంటనే పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. డీఏల విడుదల, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్…నాలుగు నెలల తర్వాత మరో డీఏ.. ఈ నెలలోనే పీఆర్సీపై నిర్ణయం
RELATED ARTICLES
