HomeDevotionalపోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని శ్రీ ఓం గణేష్‌ మండలిలో అన్నదానంకార్యక్రమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య,...

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని శ్రీ ఓం గణేష్‌ మండలిలో అన్నదానంకార్యక్రమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్‌ భుజంగరావు

నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని శ్రీ ఓం గణేష్‌ మండలి వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, అదనపు కలెక్టర్‌ భుజంగరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

భక్తులకు సీపీ, అదనపు కలెక్టర్‌ స్వయంగా భోజనం వడ్డించారు. కార్యక్రమానికి స్నేహా సొసైటీ, గ్రేసీ ఆర్గనైజేషన్‌కు చెందిన విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అదనపు డీసీపీ (అడ్మిన్‌) శుభం ప్రకాష్‌, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాలవియా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సురేష్‌, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ సందీప్‌, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ టి.పరమేశ్వర్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, టౌన్‌ ఏసీపీ ప్రకాష్‌, ఏఆర్‌ ఏసీపీ కృష్ణ, సీటీసీ ఏసీపీ రాజశేఖర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీతో పాటు సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, గణేష్‌ మండలి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments