చికిత్స పొందుతున్న వారిలో మరో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
మంగళవారం హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, చిన్నారుల మృతికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వివరాలను రిమ్స్ యాజమాన్యం వెంటనే వెల్లడించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, మృతుల సంఖ్యపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
