బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి ప్రజల మధ్య ఉండే నాయకుడని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా సాగు, తాగునీటి రంగానికి విశేష సేవలందించడంతో పాటు అల్లీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చారని పేర్కొన్నారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికీ కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శరత్, రత్నాకర్ గౌడ్, భక్త వాత్సలం, ప్రవీణ్ గౌడ్, యాదగిరి, విపుల్ గౌడ్, జావీద్ అక్రం, రామర్తి గోపి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
