HomeTelanganaNizamabadమున్సిపల్ కార్పొరేషన్‌లో వారం రోజులుగా నిలిచిన లిఫ్ట్..

మున్సిపల్ కార్పొరేషన్‌లో వారం రోజులుగా నిలిచిన లిఫ్ట్..

వికలాంగులకు తీవ్ర ఇబ్బందులునిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గత వారం రోజులుగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వికలాంగులు, వృద్ధులు పై అంతస్తులోని అధికారులను కలిసేందుకు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం కార్యాలయానికి వచ్చిన ఓ వికలాంగుడు లిఫ్ట్ పనిచేయకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మెట్లు ఎక్కాల్సి వస్తోందని వాపోయాడు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన కార్యాలయంలో కనీస సౌకర్యాలే లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. లిఫ్ట్ మరమ్మతులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

వికలాంగులు, వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments