తల్లి కాలు విరిగిఆసుపత్రి పాలు కావడంతో మనస్తాపానికి గురైన కొడుకు ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించిన ఉదంతం కామారెడ్డి లో జరిగింది . కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్‌పురా కాలనీలో ఉండే సమద్ సిద్దికి (16) .
తల్లి అమీనా ఇర్ఫానాకు రెండు రోజుల క్రితం చిన్న ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో చిన్న కుమారుడు సమద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అందరూ ఆస్పత్రికి వెళ్లగా.. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న సమద్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడాడు .
రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు సలాం ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న సమద్ కనిపించాడు. దీంతో కంగారుపడిపోయి అతను.. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించాడు.
అనంతరం సమద్‌ను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇర్ఫాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
