సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది ఓటుకు నోటు కేసులో విచారణ ఎదురుకుంటున్న రేవంత్ రెడ్డికి షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 10 వరకు యుకె, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టు ను ఆశ్రయించారు .
, ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్ పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తనకున్న బెయిల్ కండీషన్లు సడలించాలని కోరారు దీనితో లక్ష రూపాయల ష్యూరిటీ, విదేశాల్లో ఉండే అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలనే షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టుసెప్టెంబర్ 18 లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగిస్తానని అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి ని ఆదేశించింది
