HomeCRIMEప్రైవేట్ కాలేజీ ల బరితెగింపు ……హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ …..

ప్రైవేట్ కాలేజీ ల బరితెగింపు ……హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ …..

దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతొ నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా..ఈ విషయం వెలుగులోకి వచ్చిది .

ఏకంగా 8 ప్రముఖ ప్రైవేటు కళాశాలలు ఈ ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఎన్‌ఓసీల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం గమనార్హం , కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీ సర్టిఫికెట్లను తయారు చేశారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నకిలీ ఎన్‌ఓసీ పత్రాలనే ఇంటర్మీడియట్ విద్యారంగంలో అఫిలియేషన్ పొందేందుకు సదరు 8 ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ క్రమంలోనే ఎన్‌వోసీ పరిశీలన సమయంలో సదరు సర్టిఫికెట్లు పూర్తిగా ఫేక్ అని.. వాటిపై ఉన్న కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడిందని ‘హైడ్రా’, ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

ఈ మొత్తం వ్యవహారంపై ‘హైడ్రా’ యంత్రాంగం రంగంలోకి దిగింది . ఫోర్జరీకి పాల్పడిన మొత్తం 8 ప్రైవేటు కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్లే లేక్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఫోర్జరీకి పాల్పడిన కాలేజీల్లో .

  1. హైందవి జూనియర్ కాలేజ్, బర్కత్‌పుర.
  2. రెసోనెన్స్ జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్.
  3. ప్రియాం జూనియర్ కాలేజ్, మెహదీపట్నం.
  4. మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, విద్యానగర్.
  5. శ్రీ చైతన్య జూనియర్, చంద్రాయణగుట్ట.
  6. న్యూ ఎరా జూనియర్ కాలేజ్, చిక్కడపల్లి.
  7. షాహీన్ జూనియర్ కాలేజ్, శివరాంపల్లి.
  8. వశిష్ట జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లున్నాయి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments