సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వంతెన పనులను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ గార్లు పరిశీలించారు.రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ను త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు.
మూసారాంబాగ్ వంతెనను కూడా త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గారు వెల్లడించారు.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఫ్లైఓవర్లు, వంతెనలను నిర్మిస్తోందని మంత్రి అజారుద్దీన్ గారు అన్నారు.
ఫ్లైఓవర్లు, వంతెనలు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు గారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
