HomeLaw and Orderఎక్సైజ్ అధికారులను కలిసిన రెండవ కల్లు డిపో ప్రతినిధులు..

ఎక్సైజ్ అధికారులను కలిసిన రెండవ కల్లు డిపో ప్రతినిధులు..

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నతా అధికారులను రెండో నంబర్ కల్లు డిపో ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ముందుగా నిజామాబాద్ నగరంలోని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌చార్జి ఈఎస్ అరుణ్‌కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నూతనంగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ను కూడా రెండో నంబర్ కల్లు డిపో ప్రతినిధులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో వారు మర్యాదపూర్వకంగా చర్చించారు.ఎక్సైజ్ శాఖ పరిధిలో కల్లు డిపోలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సహకరించాలని వారు కోరారు.

అధికారులు, కల్లు డిపో ప్రతినిధుల మధ్య సమన్వయంతో ముందుకు సాగితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు కన్నపురం దుర్గా గౌడ్, డైరెక్టర్ శ్రీహరి గౌడ్, కల్లు డిపో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments