నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీ గౌరీ కాంప్లెక్స్ వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న లింగయ్యపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్న నిందితుడు.. లింగయ్య తలపై బండరాయితో బలంగా కొట్టినట్లు తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయపడిన లింగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
