HomeTelanganaNizamabadసేవాస్ఫూర్తి అవార్డ్స్‌–2026కు ఆహ్వానంఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ

సేవాస్ఫూర్తి అవార్డ్స్‌–2026కు ఆహ్వానంఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ

ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ‘సేవాస్ఫూర్తి అవార్డ్స్‌–2026’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.సమాజ సేవకు అహర్నిశలు కృషి చేస్తూ, వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై సహకరిస్తున్న సేవామూర్తులను ఈ సందర్భంగా సేవాస్ఫూర్తి అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు.యువతను సేవా కార్యక్రమాల వైపు చైతన్యపరుస్తూ, మరింత మంది యువతను సామాజిక సేవలో భాగస్వాములను చేయడమే సంస్థ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలు, యువత, సేవా సంస్థల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments