ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ‘సేవాస్ఫూర్తి అవార్డ్స్–2026’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.సమాజ సేవకు అహర్నిశలు కృషి చేస్తూ, వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై సహకరిస్తున్న సేవామూర్తులను ఈ సందర్భంగా సేవాస్ఫూర్తి అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు.యువతను సేవా కార్యక్రమాల వైపు చైతన్యపరుస్తూ, మరింత మంది యువతను సామాజిక సేవలో భాగస్వాములను చేయడమే సంస్థ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలు, యువత, సేవా సంస్థల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు.
