మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ సంఘం పరిధి లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆయన సోమవారం పలువురు మంత్రులతో కల్సి మీడియా తో మాట్లాడారు. కమిటీ ఇచ్చే నివేదిక మీద పార్టీ చర్యలు తీసుకుంటుంది నేను అయిన మరెవరైనా ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తోందని అర్థం అవుతోందని ఈ వివక్షను ఏమాత్రం సహిచరానిదన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాత్‌ను సపోర్టు చేస్తున్నారా? తెలంగాణ అభివృద్ది బీజేపీ ఎంపీలకు అవసరం లేదా అని ప్రశ్నించారు.
ఇది అంతా ఆషామాషీగా తీసుకునే విషయం కాదని రాష్ట్ర బీజేపీ నేతల మెతక వైఖరి వల్ల తెలంగాణ వ్యతిరేక భావజాలం పార్లమెంట్‌లో పదే పదే మాట్లాడుతున్నారు.
ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్‍కు పెట్టుబడులు ఆగిపోతాయనే కుట్రతో తన పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు.
రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. మోడీది బీజేపీ నాది కాంగ్రెస్, ఆయనది గుజరాత్ నాది తెలంగాణ ఇందులో తెలియని రాజకీయ ఎజెండా ఏంటని ప్రశ్నించారు.
