వనమహోత్సవం సందర్భంగా నిజామాజాద్ అటవీ శాఖ అధ్వర్వంలో మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్లోని కంపార్ట్మెంట్ నం. 180, మల్లారం బిట్, మల్లారం సెక్షన్, నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహంచారు.
ఈ కార్యక్రమానికి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీనర్ , ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నిజామాజాద్ నార్త్ పాటు అటవీ శాఖ సిబ్బంది హాజరయ్యారు.
అలాగే మాల్వాపూర్, మల్లారం, గాంధీనగర్, ధర్మారం, చక్రధర్ నగర్ గ్రామాల సర్పంచ్లు కార్యక్రమంలో పాల్గోన్నారు. జడ్పీహెచ్ఏస్ మల్లారం , సెయింట్ జేవియర్ స్కూల్, నిజామాబాద్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మొక్కలు నాటి, వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు.
ఈ కార్యక్రమం ద్వారా హరితవనం పెంపొందించడం, అడవుల పరిరక్షణ, పర్యావరణ పరిరిక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపాందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత కల్పించారు.
వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అటవీ శాఖ సిబ్బందికి అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపారు.
