HomeCRIMEమోటర్లు, వైర్లు, స్టార్టర్లు చోరీ.. దొంగలను పట్టుకున్న రైతులు ..

మోటర్లు, వైర్లు, స్టార్టర్లు చోరీ.. దొంగలను పట్టుకున్న రైతులు ..

పంట పొలాల్లోని వ్యవసాయ మోటర్లు, సర్వీస్‌ వైర్లు, స్టార్టర్లను చోరీ చేసి ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మెంట్రాజ్‌పల్లి గ్రామ రైతులు పట్టుకున్నారు. గురువారం ఉదయం అనుమానాస్పదంగా ఆటోలో వెళ్తున్న వారిని గుర్తించిన రైతులు అడ్డుకుని పట్టుకున్నారు.

అనంతరం వారిని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఆటోలో ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments