నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు.పదోన్నతి పొందిన వారు:
ఎస్.గంగాధర్‌రావు (నందిపేట), పి.రాజేశ్వర్ (ఉమెన్ పోలీస్‌స్టేషన్), పి.మోహన్ (సీసీఎస్), బి.జగదీశ్వర్ (పీసీఆర్), పి.చిన్న సాయిలు (సీఎస్‌బీ), జె.రాజశేఖర్ (డిచ్‌పల్లి), జి.రాజేందర్ (సిరికొండ), పి.సుదర్శన్ (నవీపేట్), కె.డేనియల్ భాస్కర్ (టౌన్-1), కె.సుంకన్న (టౌన్-2), కె.మల్లేశం (వర్ని). తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు వీరికి పదోన్నతులు కల్పించారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బంది సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిసి అభినందనలు స్వీకరించారు.చాలాకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు ఏఎస్సైలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
పదోన్నతి పొందిన వారిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించి, కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
