రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తన వంతు తోడ్పాటున అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల రాఘవేంద్ర స్వామి మఠంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ధన్వంతరి ఆరాధన ఉత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత సంవత్సరం శ్రీశ్రీశ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి కరకముల చేత ధన్వంతరి స్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా నిర్వహించాలని గుర్తు చేశారు దేశంలోనే రెండో ధన్వంతరి ఆలయం కావడం ఇందూరు ప్రజల అదృష్టం అన్నారు.
ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు పవన్ ముందడ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
