HomeCRIMEఆహార కల్తీ అధికారులు మెరుపు తనిఖీ లు .....చట్నీ ,పిస్తా హౌస్ ల్లో సోదాలు

ఆహార కల్తీ అధికారులు మెరుపు తనిఖీ లు …..చట్నీ ,పిస్తా హౌస్ ల్లో సోదాలు

హైదరాబాద్ నగర పరిధిలోని ప్రముఖ రెస్టారెంట్లలో శనివారం రాత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు, 6 ప్రత్యేక బృందాలు మొత్తం 7 ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రతా లోపాలు, పురుగులు పట్టడం వంటి పలు తీవ్ర ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.


బంజారాహిల్స్‌లోని చట్నీస్, స్పైస్ 6, ఓరీస్, జూబ్లీహిల్స్‌లోని ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలోని 4 సీజన్స్ మల్టీకుసిన్, షా ఘౌస్ రెస్టారెంట్లతో పాటు గచ్చిబౌలిలోని పిస్తా హౌస్‌లో ఈ బృందాలు సోదాలు జరిపాయి.

ఈ తనిఖీల సమయంలో కిచెన్లో సరైన పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం, శుభ్రత లేని వాతావరణంలో ఆహారాన్ని భద్రపరచడం, కుళ్లిపోయిన కూరగాయలు వాడటం, ఎఫ్‌ఎస్‌ఎస్ ఏఐ లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనలను ఉల్లంఘించినట్లుగా అధికారులు కనుగొన్నారు.

/నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లకు అధికారులు 3 షోకాజ్ నోటీసులు, 4 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. కల్తీ జరిగిందనే అనుమానంతో మొత్తం 7 రెస్టారెంట్ల నుంచి 11 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు.

గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ స్టోర్‌రూమ్‌లో మిస్‌బ్రాండింగ్ ఉల్లంఘనల కింద రూ.17,500 విలువైన 15 కిలోల డ్రై ఫ్రూట్స్, 24 కిలోల డ్రై నూడుల్స్, 5 కిలోల పొటాటో చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments