HomeTelanganaHyderabadమరో భూ కుంభకోణం కు తెరలేపిన సర్కార్ .....హరీష్ రావు

మరో భూ కుంభకోణం కు తెరలేపిన సర్కార్ …..హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం నగరం నడిబొడ్డులో మరో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని బిఆర్ యస్ నేత హరీష్ రావు ఆరోపించారు ఈ మేరకు ఓ లేఖ రాసారు . ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందన్నారు .

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో ఉన్న రూ.500 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తుందని బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు పలికే భూమిని.. కేవలం 87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతోంది. ఆ 87 కోట్లు చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా.. వారిని కాదని ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం వెనుక ఉన్న కుంభకోణం ఏంటి?.

మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని లాక్కునే దుర్మార్గం. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలో తొక్కారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠానీల్లా వేల కోట్ల భూముల పందేరం చేస్తున్నారని హరీష్ ధ్వజం మెత్తారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments