లోకసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత జిల్లా రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చిన కవిత ను బిఆర్ యస్ సస్పెండ్ చెయ్యడంతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాదించే దిశగా ఆమె కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కవిత ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు.దాదాపు పదేళ్ల పాటు ప్రభుత్వంలో పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆమె లోకసభ ఎన్నికల్లో ఓటమి తో కలత చెందారు సొంత పార్టీ ఎమ్మెల్యే ల నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు.
అధినేత ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన వెన్నుపోటు పొడిచిన నేతలను వదిలెయ్యడం ఆమె కు ఏ మాత్రం మింగుడు పడలేదు.ఢిల్లీ లిక్కర్ కేసు నేపథ్యంలో పార్టీలో మరింత క్లిష్ట పరిస్థితులు తలెత్తాయి.చివరికి సస్పెండ్ చేశారు.
టిఆర్ యస్ పార్టీ ఏర్పాటు తర్వాత మొదటి సారి జిల్లాకువస్తున్న ఆమె సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ నుంచి సమర శంఖం పూరించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. 2014లో ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో దిగ్గజ నేతలు ఓడిపోవడంతో కవిత క్రియాశీలకంగా పనిచేసారు ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు తీసుకున్న కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సోమవారం మొదటిసారిగా ఇందూరు గడ్డపై అడుగు పెడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపబోతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది .
నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 25 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు చేశారు .
ఇదే వేదిక పై నుంచి కల్వకుంట్ల కవిత పాంచజన్యం పూరించి తనకు రాజకీయ భిక్ష పెట్టిన నిజామాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
*కవిత గారి పర్యటన ఇలా
- సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇందల్వాయి మండలం గన్నారంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేస్తారు
- మాధవ నగర్ సాయిబాబా గుడి వద్ద నుంచి ర్యాలీగా నిజామాబాద్ నగరానికి బయల్దేరుతారు.
ర్యాలీ రూట్ మ్యాప్
మాధవ నగర్ సాయిబాబా ఆలయం నుంచి పులాంగ్ చౌరస్తా, రాజ రాజేంద్ర చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల మధ్య సమావేశ వేదిక వద్దకు కవిత చేరుకుంటారు.
సభకు భారీ ఏర్పాట్లు
నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న పాంచజన్య సంకల్ప సభ కు తెలంగాణ రక్షణ సేన నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ పట్టణంలోని అన్ని కూడళ్లను పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. నిజామాబాద్ కు వచ్చే అన్ని దారుల్లో సభకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు.
సభకు తరలివచ్చి వేలాది మంది నాయకులు, కార్యకర్తల కోసం కలెక్టరేట్ గ్రౌండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు, కార్యకర్తల కోసం తాగునీరు సహా ఇతర ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంచారు.
పాంచజన్య సంకల్ప సభ అనంతరం కవిత నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
