జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి జూబ్లీహిల్స్ రోడ్ నం.71లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ పక్రియ జరిగింది .
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ జరిగింది . . ఈ సొసైటీలో సినిమా రాజకీయ వ్యాపార దిగ్గజాలు సభ్యులుగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలు సభ్యులు కావడంతో.ఈ సొసైటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఉంది. మొత్తం 15స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కోటి, మహిళలకు రెండు, జనరలు 12 స్థానాలు కేటాయించారు.
